AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత.. రేవంత్ అరెస్ట్..

గన్‌పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లకుండా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎలక్షన్ కోడ్ పేరుతో రేవంత్‌రెడ్డిని అడ్డుకోవడం కలకలం రేపింది. దీంతో పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుున్నారు.

రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. డబ్బు, మద్యం పంచకుండా ఎన్నికలకు వెళ్దామా? అని కేసీఆర్‌కి రేవంత్ సవాల్ విసిరారు. తన సవాలుకు సిద్ధమైతే అమరవీల స్తూపం వద్ద ప్రమాణం చేద్దాం రమ్మని కేసీఆర్‌ని కోరారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలతో కలిసి రేవంత్ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు రేవంత్ సహా కాంగ్రెస్ నేతలను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వాహనాలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసుల వ్యాన్ ఎక్కి మరీ రేవంత్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.

ANN TOP 10