AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

య‌జ్ఞంలా కుక్క‌ర్ల పంపిణీ

అలుపెర‌గ‌కుండా సాగుతున్న కార్య‌క్ర‌మం
అడుగ‌డుగునా జ‌ననీరాజనం, సేవ‌ల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం
ఆదిలాబాద్ః ఎన్నారై, కేఎస్ఆర్ ఫౌండేష‌న్ చైర్మన్‌, కాంగ్రెస్ నేత కంది శ్రీ‌నివాస‌రెడ్డి చేప‌ట్టిన కుక్క‌ర్ల పంపిణీ కార్య‌క్ర‌మం ఓ య‌జ్ఞంలా సాగుతోంది. కంది శ్రీ‌నివాస‌రెడ్డి అందుబాటులో లేక‌పోయిన‌ప్ప‌టికీ కార్య‌క్ర‌మం ఎక్క‌డా ఆగ‌కూడ‌ద‌నే ల‌క్ష్యంతో ఆయ‌న స‌తీమ‌ణి సాయిమౌనారెడ్డి చేతుల మీదుగా మ‌హిళ‌ల‌కు కుక్క‌ర్లు పంపిణీ చేయిస్తున్నారు. ఇవాళ బెల్లూరి, జీడీఎస్, దుర్గాన‌గ‌ర్‌ కాల‌నీ, సీసీఐ క్వార్ట‌ర్స్ కాల‌నీల్లో ప్రెష‌ర్ కుక్క‌ర్ల పంపిణీ చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజ‌రై కుక్క‌ర్ల‌ను అంద‌జేశారు. ఆమెకు కాల‌నీవాసులు బొట్టుపెట్టి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సేవ చేయాల‌నే ఏకైక ల‌క్ష్యంతోనే త‌న భ‌ర్త అమెరికా నుండి ఆదిలాబాద్‌కు వ‌చ్చార‌ని సాయి మౌనారెడ్డి అన్నారు. కేఎస్ ఆర్ ఫౌండేష‌న్ స్థాపించి ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నార‌ని తెలిపారు. మ‌హిళ‌ల‌ను త‌న తోబుట్టువులుగా భావించి ఒక అన్న‌గా ఈ కుక్క‌ర్ల‌ను చిరు కానులు అందిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.

రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టిన‌ట్టు వెల్ల‌డించారు. ఇదివ‌ర‌కే త‌న సంపాద‌న‌లో స‌గం ఆదిలాబాద్ ప్ర‌జ‌ల కోస‌మే ఖ‌ర్చు పెడ‌తాన‌ని చెప్పార‌ని, సేవ‌ల ద్వారా ఆ విధంగానే చేసి చూపిస్తున్నార‌ని అన్నారు. ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేయాల‌నే ఆలోచ‌నే ఆయ‌న‌ను ఇక్క‌డ‌కు ర‌ప్పించింద‌న్నారు. ఒక్క‌సారి త‌న భ‌ర్త కంది శ్రీ‌నివాస‌రెడ్డికి అవ‌కాశం ఇవ్వాల‌ని, ఆయ‌న‌కు అంద‌రి ఆశీర్వాదాలు అందించాల‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐనేని సంతోష్‌రావు, ఎంఎ.షకీల్, రమేష్, సూర్యకాంత్, స్వామి, విట్టల్, మతీన్ ఖాన్, ఎంఎ.ముఖీమ్, అమ్జ‌ద్‌ ఖాన్, కర్మ, అస్బాత్ ఖాన్, హరీష్ రెడ్డి, మహమూద్, కొండూరి రవి,నాని, విష్ణు, అభినవ్, రాజు, ప్రకాష్, కిరణ్, భీమ్ రావు, కర్మ, తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10