లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ఫుల్ సంతోషంగా ఉన్నారు. ఇటీవలే జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీ దాదాపు రూ.1000 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. దీంతో లేడీ సూపర్ స్టార్ కు హిందీలో వరుస అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో నయనతార మంచి బాండింగ్ ఏర్పడింది. ఇటీవలే తన భర్తతో కలిసి అంబానీ ఇంట్లో వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు నయన్ తన కుటుంబంతో కలిసి మలేసియా వెళ్లారు. తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి.. తన కుమారులు ఉయిర్ రుద్రోనీల్ ఎన్ శివన్, ఉలగ్ దైవిక్ ఎన్ శివన్ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
కౌలాలంపూర్ కు వెళ్లిన నయన్, విఘ్నేశ్ దంపతులు.. పెట్రోనాస్ ట్విన్ టవర్ వద్ద బర్త్ డే సెలబ్రెషన్స్ నిర్వహించారు. “మై ట్విన్ టవర్స్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. సంతోషం.. ఆశీస్సులకు ఏడాది. జీవితంలో మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలని.. చుట్టూ ఉన్న వాళ్లకు సంతోషాన్ని అందించాలని కోరుకుంటున్నాం. మీ మా జీవితాలను మరింత అందంగా మార్చి.. ఎన్నో వెలుగులు నింపారు. మీతో గడిపే ప్రతి క్షణం పండగలా ఉంటుంది. మీ పుట్టినరోజు వేడుకను ఈ ఎత్తైన పవర్ పుల్ టవర్స్ వద్ద చేయాలని కలలు కన్నాం. అనుకున్నట్లుగానే మీ బర్త్ డేను సెలబ్రెట్ చేసినందుకు సంతోషంగా ఉంది” అంటూ తన కుమారులతోపాటు దిగిన ఫోటోస్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. నయన్ షేర్ చేసిన ఫోటోలకు సినీ సెలబ్రెటీలు స్పందిస్తూ.. ఉయిర్, ఉలాగ్ లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.









