దర్శకులందరిలోకి రామ్ గోపాల్ వర్మ శైలి భిన్నంగా ఉంటుంది. ఆయన కెమెరా దృష్టి ఎప్పుడూ కొత్త కోణాలను వెతుకుతుంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే వర్మ చేసిన తాజా పోస్టు వైరల్ అవుతోంది. చీరకట్టులో ఉన్న ఓ అందాలభామ చేతిలో కెమెరాతో వయ్యారాలు ఒలకబోయడాన్ని వర్మ పంచుకున్న వీడియోలో చూడొచ్చు. అయితే ఆ వీడియోలో ఉన్న కెమెరా సుందరి ఎవరో మాత్రం తెలియదు. వర్మ కూడా అదే అడిగారు… ఈవిడ ఎవరో నాకు చెబుతారా? అంటూ ఆరా తీసే ప్రయత్నం చేశారు. వర్మ కంట్లో పడిన అమ్మాయి కావడంతో, ఈవిడపై నెట్టింట భారీగానే చర్చ జరుగుతోంది.









