AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఐటీ ఉద్యోగుల ఛలో రాజమండ్రి కార్ల ర్యాలీ..

సరిహద్దుల్లో అడ్డుకుంటున్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఐటీ ఉద్యోగులు.. వీకెండ్‌లో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి కార్ల ర్యాలీ ప్రారంభించారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ… చంద్రబాబు అరెస్ట్ అవ్వడంతో.. ఈ అరెస్టును నిరసిస్తూ ఐటీ ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు సంఘీభావంగా కార్ల ర్యాలీ ప్రారంభించారు. శనివారం రాత్రి నుంచి కంటిన్యూగా ఉద్యోగులు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఎస్సార్ నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి ఏపీకి బయలుదేరారు.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆదివారం రాజమండ్రిలో చంద్రబాబు భార్య భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలపనున్నారు. ఐతే.. ఏపీ-తెలంగాణ సరిహద్దు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. కార్ల ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకుంటున్నారు.

ఐటీ ఉద్యోగులు ర్యాలీ చేపడితే కేసులు నమోదుచేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాహనాల యాజమానులపై కేసు నమోదు చేస్తామని చెబుతున్నారు. తాము ర్యాలీ చెయ్యట్లేదనీ, వీకెండ్ కావడంతో ఏపీకి వెళ్తున్నామని కొందరు టెక్కీలు చెబుతున్నారు. పోలీసులు మాత్రం… ఈ నెల 24న (ఆదివారం) హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఐటీ ఎంప్లాయిస్.. కార్లతో ర్యాలీ చేస్తున్నారని తమకు ఇన్ఫర్మేషన్ ఉంది అని అంటున్నారు. అలాంటి ర్యాలీ చేస్తే చట్ట ప్రకారం కటిన చర్యలు ఉంటాయని చెబుతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10