పార్టీలో జోరుగా ప్రచారం
హుటాహుటిన బెంగళూరుకు పయనం
అటు నుంచి ఢీల్లీకి..
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే విషయంలో మరో అడుగు ముందుకు పడింది. షర్మిలను రాజ్యసభకు, అలాగే ఏఐసీసీలో కీలక పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో షర్మిల శనివారం హుటాహుటిన బెంగళూరుకు వెళ్లారు. అక్కడి నుంచి ఢీల్లీకి వెళ్తారని సన్నిహితులు చెబుతున్నారు.
వైఎస్ షర్మిల..∙వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయి. ఐతే.. షర్మిల మాత్రం దీనిపై స్పష్టత ఇవ్వట్లేదు. చర్చలు సాగుతున్నాయని చెబుతున్నారే తప్ప, విలీనం ఎప్పుడు చేసేదీ చెప్పట్లేదు. ఖమ్మంలోని పాలేరు స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలని షర్మిల అనుకున్నారనీ, ఐతే.. పాలేరు స్థానానికి పార్టీలో కనీసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. వారిని కాదని షర్మిలకు ఆ ఛా¯Œ ్స ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. అందువల్ల కాంగ్రెస్ హైకమాండ్.. కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు తెలిసింది.
కొత్త ప్రపోజల్ ప్రకారం… షర్మిలను నుంచి రాజ్యసభకు పంపాలనీ అలాగే ఆమెను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ టీమ్‌లో షర్మిలకు స్థానం కల్పించి, జాతీయ స్థాయిలో ఆమె సేవల్ని వినియోగించుకోవాలని పార్టీ సిద్ధమైనట్లు సమాచారం.
ఈ ప్రతిపాదన బాగానే ఉన్నా, దీనిపై షర్మిల ఎలా ముందుకెళ్తారన్నది ఆసక్తిగా మారింది. అయితే .. ఈ ప్రతిపాదననున షర్మిల ఒప్పుకునే అవకాశాలు తక్కువ అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే, షర్మిల ఫోకస్ మొత్తం తెలంగాణపై ఉంది. ఆమె నిరంతరం బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అసెంబ్లీ లక్ష్యంగా ఆమె అడుగులు వేస్తున్నారు. ఇవన్నీ పక్కనపెట్టి, ఇప్పుడు రాజ్యసభకు వెళ్తే, ఆమె యాక్టివ్ పాలిటిక్స్‌కి దూరం అయ్యే పరిస్థితి ఉంటుందని కొందరు అంటున్నారు. రాజ్యసభకు వెళ్లినా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఆమె తెలంగాణలో యాక్టివ్ పాలిటిక్స్‌లో పాల్గొనవచ్చని కొందరు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ కొత్త ప్రతిపాదనపై కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌తో చర్చించేందుకు షర్మిల బెంగళూరు వెళ్లారు. తమ కుటుంబానికి సన్నిహితుడైన డీకే మొదటి నుంచి ఆమెను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తూనే ఉన్నారు. అందువల్ల ఈ నెలాఖరు నాటికి షర్మిల ఫైనల్ నిర్ణయం తీసుకుంటారని సన్నిహితులు చెబుతున్నారు.









