AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంద్రబాబు అరెస్ట్ ను కేసీఆర్ ఖండించాలి.. రేపు నిరాహారదీక్ష చేస్తా..

ఒక ప్రజాస్వామ్యవాదిగా చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను కేసీఆర్ ఖండించాలని తెలంగాణ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో కేసీఆర్ మంత్రిగా చేశారని… రాజకీయాలను పక్కన పెట్టి అరెస్ట్ పై కేసీఆర్ స్పందించాలని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒక మనిషిగా మారాలని చెప్పారు. గతంలో జైల్లో ఉన్న జగన్ గెలిచాడని, ఇప్పుడు జైల్లో ఉన్న చంద్రబాబు గెలుస్తారని చెప్పారు. ప్రజలు దయగలవారని చెప్పారు. ఈరోజు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో మోత్కుపల్లి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పై విమర్శలు గుప్పించారు.

ఏ ఆధారాలు లేకపోయినా, ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశావని మోత్కుపల్లి మండిపడ్డారు. రాత్రి పూట ఒక దొంగ మాదిరి పోలీసులు తీసుకెళ్లేంత స్థితిలో చంద్రబాబు ఉన్నారా? ఇలా అరెస్ట్ చేసినందుకు మీకు సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు.

రెండు, మూడు రోజులలో రాజమండ్రికి వెళ్లి నారా భువనేశ్వరిని పరామర్శిస్తానని… ములాఖత్ అవకాశం వస్తే జైల్లో చంద్రబాబును కలుస్తానని మోత్కుపల్లి చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా తాను రేపు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరాహార దీక్ష చేపడుతున్నానని తెలిపారు. చంద్రబాబుకు క్షమాపణ చెప్పి, తప్పును సరిచేసుకోవాలని జగన్ కు సూచించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10