AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్ మాట్లాడుతుండగా మొబైల్ ఫోన్‌లో ఎమర్జెన్సీ అలర్ట్!

స్మార్ట్ ఫోన్‌లలో ఎమర్జెన్సీ అలర్ట్ వినియోగదారులను గందరగోళానికి గురి చేసిన విషయం తెలిసిందే. చాలామంది మొబైల్ ఫోన్లకు ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది. ఎమర్జెన్సీ అలర్ట్‌ సిస్టమ్‌ టెస్టింగ్‌లో భాగంగా కేంద్రం నుంచి ఈ మెసేజ్‌ వచ్చింది. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో ఓ సమావేశంలో మాట్లాడుతూండగా ఈ సందేశం వచ్చింది.

ఆయన మాట్లాడుతుండగా కేంద్రం నుంచి వచ్చిన ఎమర్జెన్సీ అలర్ట్ సైరన్ మోగింది. అలర్ట్ సైరన్ గమనించిన మంత్రి కేటీఆర్ ఏమైనా ఫైర్ అలారమా? వెళ్లిపోదామా? అని ప్రశ్నించారు. అయితే స్పీకర్‌లో సౌండ్ వస్తుందని అధికారులు చెప్పగానే.. స్పీకరేనా, ఓకే… ఇది క్లోజ్డ్ ఆడిటోరియం.. అందరికీ గుడ్ లక్ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే ఇది మొబైల్ ఫోన్లో వచ్చిన మొబైల్ అలర్ట్ అన్నది తర్వాత తెలిసింది!

ANN TOP 10