తన అందచందాలతో పాటు నటనలో ప్రతిభ చూపిస్తూ స్టార్ స్టేటస్ పట్టేసింది పూజా హెగ్డే. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన శారీ లుక్స్ వైరల్ అవుతున్నాయి.
ముంబైలో పుట్టి పెరిగిన పూజా మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొంది. దీంతో మోడలింగ్ చేసే అవకాశాలు కూడా వచ్చాయి. సినిమాల వైపు ఆసక్తితో తొలిసారిగా ముగామూడీ తమిళ చిత్రంలో నటించింది. తరచూ గ్లామరస్ ఫొటో షూట్స్ షేర్ చేస్తూ హాట్ అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ.










