AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బిచ్చగాడు సినిమా హీరో కుమార్తె ఆత్మహత్య

చెన్నై: బిచ్చగాడు సినిమా హీరో విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని అల్వార్ పేటలో తన ఇంట్లోనే మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు మీరా(16) ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే కావేరి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. మీరా ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు వెల్లడించారు. విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొన్ని రోజుల నుంచి ఆమె మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్టు సమాచారం. కోలీవుడు ప్రముఖులు సంతాపం తెలిపారు.

ANN TOP 10