ఇండియా ప్రజలంతా హైదరాబాద్ వైపు చూస్తున్నారని సీడబ్ల్యూసీ మెంబర్ పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. నేడు తాజ్ కృష్ణ వద్ద పవన్ ఖేరా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రజాస్వామిక పార్టీ అని అన్నారు. రాహుల్ పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడిని కూడా ఎన్నికల ద్వారానే ఎన్నుకుంటామన్నారు. సీడబ్ల్యూసీ సమవేశాల్లో కీలకమైన అంశాలను చర్చిస్తామన్నారు. తాము ఏ జర్నలిస్ట్‌నీ బ్లాక్ లిస్ట్‌లో పెట్టలేదన్నారు. విద్వేషం రెచ్చగొట్టే వాళ్ళని దూరం పెట్టాలని అనుకున్నామన్నారు. తాము చేసేది తప్పని భావించిన వాళ్లని మళ్లీ అక్కున చేర్చుకుంటామని పవన్ ఖేరా అన్నారు.