AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై.. ఏక వాక్యంతో తుమ్మల రాజీనామా..

బీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన రాజీనామా లేఖను పంపారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఅర్‌కి పంపారు. ‘ఇన్నాళ్లూ సహకరించినందుకు నా ధన్యవాదాలు… పార్టీకి నా రాజీనామా ఆమోదించగలరు’ అంటూ ఏక వాక్యంతో రాజీనామా లేఖను తుమ్మల ముగించారు.

అసెంబ్లీ ఎన్నికల ముంగిట అధికార బీఆర్ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ గూటికి చేరడం ఖాయమైంది. శనివారం హైదరాబాద్‌కు వస్తున్న ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ లో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సీడబ్ల్యూసీ సమావేశాల ప్రారంభానికి ముందే మధ్యాహ్నం 2 గంటల సమయంలో తుమ్మల కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు పేర్కొన్నాయి.

ANN TOP 10