నిజామాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రే.. బతికున్న కూతురికి పెద్దకర్మ చేసిన ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో పెద్ద కూమార్తెకు తండ్రి మహేష్ పెళ్లి చేయగా.. కొద్దిరోజులకే అల్లుడికి బోన్ క్యాన్సర్ అని బయటపడింది. దీంతో భర్తకు క్యాన్సర్ కారణంగా కూతురు తిరిగి తల్లిగారింటికి వచ్చి చేరింది. అయితే కొద్ది రోజులకే ప్రేమించిన వ్యక్తితో కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో కూతురిపై తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏకంగా కూతురు చనిపోయిందంటూ మహేష్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. బతికుండగానే కూతురికి పెద్దకర్మ చేశాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా పెను చర్చకు దారి తీసింది.