AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టెట్ పరీక్షలో ఘోర తప్పిదం.. ఒక పేపర్‌కు బదులు ఇంకో పేపర్..

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన టెట్ లో తప్పిదం చోటుచేసుకుంది. రాష్ట్రమంతా ప్రశాంతంగా జరిగిన పరీక్ష.. మంత్రి కేటీఆర్ ఇలాకాలో మాత్రం అధికారుల నిర్లక్ష్యానికి అభ్యర్థులను ఆగమాగం చేసేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాల్లో అధికారులు నిర్లక్ష్యంతో.. అభ్యర్థులకు ఒక పేపర్‌కు బదులు ఇంకొక పేపర్ ఇచ్చారు. ఇలా 15 సెంటర్లలో ఇదే సీన్ రిపీటైంది. మూడు సెంటర్లలో చూసుకోకుండానే అభ్యర్థులకు ఇన్విజీలేటర్స్ పేపర్స్ ఇవ్వగా.. దాదాపు అరగంట సేపు పరీక్ష కూడా రాసేశారు. అప్పుడు నిద్రమత్తు నుంచి తేరుకుని తప్పుడు పేపర్ ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు.

అప్పుడు ఆగమేగాల మీద పరీక్ష కేంద్రాలకు పరుగులు తీశారు. అప్పటికే.. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌లో దాదాపు 30 ప్రశ్నలకు సమాధానాలు పెట్టేశారు. దీంతో.. అప్పటివరకు నింపేసిన బబూల్స్‌ను.. వైట్‌నర్‌తో రబ్ చేయమని అధికారులు ఉచిత సలహాలు ఇచ్చారు. వైట్‌న‌ర్‌తో రబ్ చేస్తే సమాధానం వ్యాలిడ్ కాదని అభ్యర్థులు.. అధికారులతో వాగ్వాదానికి దిగారు.

ఇక చేసేదేమీ లేక.. అభ్యర్థులు అధికారులు చెప్పినట్టుగానే వైట్‌నర్స్‌తో రబ్ చేసి మళ్లీ కొత్తగా పరీక్ష రాశారు. అయితే.. సాయంత్రం ఐదు గంటలకు ముగియాల్సిన పరీక్షను.. ఆయా సెంటర్లలో ఆరు గంటల వరకు పొడిగించారు. అయితే.. ఆందోళనలో.. ఏం రాస్తున్నామో కూడా తెలియకుండా అభ్యర్థులు పరీక్ష రాసేశారు. దీంతో.. అభ్యర్థులు అయోమయంలో పడిపోయారు. తమకు న్యాయం చేయాలంటూ పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ జీవితాలు ఆగమైపోతున్నాయంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10