హస్తం గూటికి చేరేందుకు తుమ్మల నాగేశ్వరరావుకు లైన్‌క్లియర్ అయింది. సెప్టెంబర్ 17న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా తుమ్మలతో సమావేశమై పార్టీలోకి ఆహ్వానించారు. తాజాగా శుక్రవారం కూడా మరోసారి తుమ్మలతో రేవంత్‌రెడ్డి, థాక్రే, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు దాదాపుగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ నెల 17న హైదరాబాద్‌లో సోనియాగాంధీతో భారీ బహిరంగ సభ జరగనుంది. అలాగే హైదరాబాద్‌లోనే సీడబ్ల్యూసీ సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ముఖ్యనేతలంతా తరలివస్తున్నారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లిఖార్జునఖర్గే, తదితర ముఖ్యనేతలంతా భాగ్యనగరానికి తరలివస్తున్నారు. వీరి సమక్షంలోనే తుమ్మల నాగేశ్వరరావు.. కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.