కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. అయితే ఒకరోజు ముందుగానే ఆయన హైదరాబాద్ (Hyderabad)కు వస్తున్నారు. శనివారం రాత్రి తెలంగాణ బీజేపీ నేతలతో ఆయన కీలక సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
శనివారం రాత్రి 7.55 గంటలకు అమిత్ షా ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 8.15 గంటలకు హైదరాబాద్‌లోని సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆఫీసర్స్ మెస్‌కు వెళతారు. అక్కడే రాత్రికి బస చేస్తారు. 17వ తేదీ (ఆదివారం) ఉదయం 8.35 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌కు అమిత్ షా వస్తారు. విమోచన ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. 9 గంటల నుంచి 11 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత 11.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరి.. 11.50 నిమిషాలకు ఢిల్లీకి బయలుదేరి వెళతారు. దీంతో అమిత్ షా రెండు రోజుల పర్యటన ముగుస్తుంది.