AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు తెలంగాణలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 9 మెడికల్ కాలేజీలను ఈ రోజు కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, భూపాలపల్లి, కుమ్రుం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం మెడికల్ కాలేజీల్లో.. ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభంకానున్నాయి. ఇందులో భాగంగానే.. 9 మెడికల్ కాలేజీలను వర్చువల్‌ గా ఈ రోజు కేసీఆర్ ప్రారంభించనున్నారు.

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్యను చేరువచేయటంతోపాటు.. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే లక్ష్యంతో జిల్లాకి ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్‌ సర్కార్‌ పేర్కొంది. గతేడాది ఒకే వేదిక నుంచి కేసీఆర్ 8 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఇవాళ ఆ కాలేజీలను ఓపెనింగ్‌ చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.

ANN TOP 10