AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భద్రతకు ఈ నంబర్‌ను సేవ్‌ చేసుకోండి

మహిళల భద్రత కోసం ఉమెన్స్ సెఫ్టీ వింగ్ చర్యలు
అందుబాటులోకి కొత్త ఫోన్ నంబర్ల
మహిళల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ సైతం ఏర్పాటు చేసింది. మహిళల భద్రతకు మార్గదర్శకులుగా నిలవడమే షీ టీమ్స్‌ ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం పలు సందర్భాల్లో వెల్లడించింది. మహిళలు, పిల్లలు, బాలికలపై నేరాలు జరుగుతున్నాయని తెలిసి ఆయా ఇబ్బందికర ప్రాంతాల్లో హాట్‌స్పాట్లు ఏర్పాటు చేసి షీ టీమ్స్‌ తనిఖీ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. రాష్ట్ర మహిళా భద్రత విభాగం కొత్త ఫోన్‌ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మహిళా భద్రత విభాగం ట్విట్టర్‌ నూతన నంబర్లను వెల్లడించారు.

మహిళలు, విద్యార్థినులు ఏ రకమైన వేధింపులు ఎదుర్కొన్నా.. 8712656858 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చునని అధికారులు స్పష్టం చేశారు. 8712656856 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ రెండు నంబర్లు గుర్తు లేకపోతే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు.

ఇక సోషల్‌ మీడియా వేదికగా మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న పోకిరీలపై తెలంగాణ ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఉక్కుపాదం మోపుతోంది. ఆడపిల్లలను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా, తిట్టినా, వారి ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్‌ చేసినా, సోషల్‌ మీడియా అకౌంట్లలో పోస్టు చేసినా, మిత్రులకు షేర్‌ చేసినా తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నారు.

ANN TOP 10