గతేడాది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాం.. ఈ సారి కూడా జరుపుతామని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర బిజెపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇప్పటి వరకు నిర్వహించలేదు. మజ్లిస్‌కు భయపడే తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించలేదన్నారు.
17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రజలను ఆయన కోరారు. చరిత్రలో ప్రతీ ప్రత్యేక ఘట్టానికి ఉత్సాహంగా, పండగగా, వేడుకగా జరుపుకుంటాం.. కానీ రాష్ట్రంలో 75 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాలను అధికారికంగా జరపకపోవడం దురదృష్టకరం అన్నారు. ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు ఆసక్తి చూపడం లేదన్నారు.
రాష్ట్రపతిభవన్‌లో..
రాష్ట్రపతి భవన్‌లో ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు.









