నల్గొండ: సీఎం కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన ఉండదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం బీజేపీ బూత్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఈటల పాల్గొని ప్రసంగించారు. దళితులు, గిరిజనులు, ప్రజలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కేసీఆర్‌కు గుర్తుకొస్తారన్నారు. అసెంబ్లీలో సమస్యలపై ప్రశ్నిస్తే స్పీకర్ మైకు బంద్ చేస్తారని.. కేసీఆర్ తన మాటలతో దాటేస్తారని మండిపడ్డారు. వృద్దులకు, వితంతువులకు పింఛన్లు ఇవ్వకుండా తన దగ్గరే తాళం వేసుకొని హైదరాబాద్‌లో కూర్చున్నారన్నారు. దమ్ముంటే కేసీఆర్ పింఛన్లు అందజేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో ఎన్నికలకు ప్రజల ముందుకు వస్తారన్నారు. ఇచ్చిన డబ్బులు తీసుకొని ఓటు మాత్రం ధర్మానికి వేయాని.. కేసీఆర్‌ను ఓడగొట్టాలని ఈటల కోరారు.









