AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం..

తెలంగాణలో జిల్లాకో మెడికల్ కాలేజీని నిర్మిస్తోన్న కేసీఆర్ ప్రభుత్వం.. మరో 9 కాలేజీలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రంలో 15 కాలేజీలను ప్రారంభించగా.. మరో 9 మెడికల్ కళాశాలలను సెప్టెంబర్ 15న ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ ఒక్క రోజునే 9 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. దీంతో తెలంగాణలో మొత్తం 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో వైద్య విద్యలో తెలంగాణ ప్రభుత్వం కొత్త రికార్డు సృష్టించినట్టవుతోంది. ప్రభుత్వ రంగంలో దేశంలోనే అత్యధిక మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది.

అయితే.. ఈ సెప్టెంబర్ 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కొత్తగా నిర్మించిన తొమ్మిది వైద్య కళాశాలలను ప్రారంభించి, తరగతులను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు రాష్ట్రంలోని విద్యార్థులకు వైద్య విద్యను మరింత చేరువ చేసేందుకు వీలుగా జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.

మెడికల్‌ కాలేజీల ప్రారంభోత్సవంపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. గతేడాది తెలంగాణలో విద్యార్ధులకు 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రాగా… ఇప్పుడు మరో తొమ్మిది ప్రారంభమవుతున్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా ప్రారంభించే తొమ్మిది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతుల ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ANN TOP 10