AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

10 అడుగుల కొండచిలువ హల్ చల్..

గిరి నాగు, తాచుపాములు వంటివి ఇళ్లల్లో చేరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ కొండ చిలువ హల్ చల్ చేసింది. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డు సింగరేణి మెయిన్ ఆస్పత్రి ఏరియా గౌతమ్ నగర్ లో 10 అడుగుల కొండ చిలువ ప్రత్యక్షం అయింది. భారీ కొండ చిలువను చూసిన స్థానికులు భయ బ్రాంతులకు గురయ్యారు. బొడ్డురాయి ఏర్పాటు కోసం పొదలను తొలగించి స్థలాన్ని శుభ్రం చేస్తుండగా భారీ కొండచిలువ ఒక్కసారిగా బయటకు వచ్చింది. పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి ప్రవేశించింది. దీంతో బస్తీ వాసులు వణికి పోయారు సమాచారం తెలుసుకున్న స్థానిక యువకులు ధైర్యం చేసి కొండచిలువకు ప్రాణహాని తలపెట్టకుండా చాకచక్యంగా పట్టుకున్నారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ సిబ్బంది సహాయంతో సమీప అటవీ ప్రాంతంలో కొండచిలువను సురక్షితంగా వదిలిపెట్టారు.

కొండ చిలువలు అటవీ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఆసియా దేశాలైన భారత్, పాకిస్తాన్, చైనా, శ్రీలంక, ఇండోనేషియా వంటి ప్రాంతాల్లో కనిపిస్తాయి. అంతేకాదు భారీ కొండచిలువలు సహారా ఎడారికి దక్షిణ ప్రాంతాల్లో , ఆఫ్రికాలోని ఉష్ణప్రాంతాల్లో కూడా కనిపిస్తాయి. వీటి ప్రధాన ఆహారం ఇతర జంతువులు.. తమకు దొరికిన జంతువులను ముందుగా తమ శరీరంతో చుట్టి.. ఉక్కిరి బిక్కిరి చేసి తర్వాత వాటిని మింగి తాపీగా అరిగించుకుంటుంది. ఒకొక్కసారి కొండ చిలువ ఏకంగా మనుషులను కూడా మింగి ఆకలి తీర్చుకుంటుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10