మానిక్‌రావు ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణలో లెఫ్ట్‌పార్టీలతో చర్చలు ఇంకా అధికారికంగా జరగలేదని మానిక్‌రావు ఠాక్రే వెల్లడిరచారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… లెఫ్ట్ పార్టీలతో పొత్తు చర్చలు సీఎల్పీ లీడర్, పీసీసీ ప్రెసిడెంట్ సమక్షంలో జరుగుతాయని అన్నారు. పొత్తుల గురించి అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. సీపీఐతో అనధికార సమావేశం జరిగిందని.. అందులో పొత్తుల గురించి, సీట్ల గురించి చర్చ జరగలేదని… ఇంకా ప్రాథమిక చర్చలే అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పార్టీకి ఉపయోగపడే విషయాలు పీసీసీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలోనే జరుగుతాయన్నారు. తనను ప్రత్యక్షంగా చర్చలు జరపమని హైకమాండ్ చెప్పలేదన్నారు. కాంగ్రెస్‌కు మద్దతు పలకడానికి చాలా పార్టీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. తనను కలవడానికి చాలా మంది వస్తుంటారని.. అందులో మందకృష్ణ మాదిగ, ఆర్. కృష్ణయ్య ఇతర సంఘాల నేతలు కూడా వచ్చారన్నారు. కానీ వాళ్ళు ఏదేదో మాట్లాడితే తాను చేసేది ఏముందని అన్నారు. కమ్యూనిస్టులతో చర్చలు ఆర్.కృష్ణయ్యతో భేటీ లాంటి అంశాలు పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టికి చెప్పే వెళ్లినట్లు మానిక్‌రావు ఠాక్రే పేర్కొన్నారు.









