AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రోడ్లపై అర్ధనగ్నంగా తిరుగుతూ యువతి వీరంగం

హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో మద్యం మత్తులో ఓ యువతి వీరంగం సృష్టించింది. అర్ధనగ్నంగా రోడ్లపై తిరుగుతూ హల్‌చల్‌ చేసింది. బ్లేడుతో యువకులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అప్రమత్తమైన యువకులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఆ యువతనికి అదుపులోకి తీసుకుని దుస్తులు తొడిగారు. అనంతరం ఆటోలో ఎక్కుంచుకుని దోమల్‌గూడ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కొన్ని గంటల తర్వాత మద్యం మత్తునుంచి కోలుకున్న యువతి.. పోలీస్‌ స్టేషన్‌ నుంచి స్వయంగా బస్సెక్కి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. అయితే యువతి వివరాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10