AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు సూర్యాపేటకు సీఎం కేసీఆర్‌

సూర్యాపేట పట్టణానికి సీఎం కేసీఆర్‌ ఆదివారం రానున్నారు. ఈ మేరకు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చే సుకున్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, సమీకృత కలెక్టరేట్‌ కార్యాల యం,జిల్లా పోలీస్‌కార్యాలయం,సమీకృత మార్కెట్‌, సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌,బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవాల అనంతరం సుమారు రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ కు జనసమీకరణ చేసేందుకు ఉమ్మడినల్లగొండ జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూర్యాపేట నియోజకవర్గ భాధ్యతలు అప్పగించారు.

సూర్యాపేట పట్టణమంతా గులాబీమయమైంది. గులాబీ జెండాలు, ప్లెక్సీలతో పట్టణంలోని వీధుల న్నీ నిండిపోయాయి. సీఎం పర్యటనకు అడ్డంకిగా వర్షం వస్తే ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీస్‌ అధికారులు సుమారు 3వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సీఎం కాన్వాయ్‌ ట్రయల్‌రన్‌ నిర్వహించారు.సీఎం పర్యటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను డీఐజీ చౌహాన్‌, కలెక్టర్‌ వెంకట్రావ్‌, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, ఇంటలిజెన్స్‌ సెక్యూరిటీ అధికారులు శనివారం పరిశీలించారు.

ANN TOP 10