తాను పార్టీ మారుతానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తనపై తప్పుడు వార్తలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం జరుగుతుందని, ఈ సంప్రదాయం బాగోలేదని ఆక్షేపించారు. సమస్యలపై మాట్లాడేందుకు మంత్రులను, సీఎంను కలవడం తప్పేలా అవుతుందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. సాధారణ వ్యక్తి వినతిపత్రం ఇచ్చినట్లే తాను కూడా ఇచ్చానన్నారు. తన రాజకీయ జీవితం రాహుల్ వెంటేనని, సంగారెడ్డిలో రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని జగ్గారెడ్డి తెలిపారు.









