AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ 16 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ

రెండు వారాల క్రితం కురిసిన భారీ వర్షాల తరహాలోనే మళ్లీ తెలంగాణ వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.శుక్రవారం నుంచి వర్షాలు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది మరో మూడు రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌ఘడ్ మీదుగా కదులుతుంది. దీని ప్రభావం తెలంగాణపై వర్షరూపంలో పడవచ్చని వాతావరణశాఖ తెలిపింది.

ఈ అల్పపీడన ప్రభావంతోనే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావారణశాఖ తెలిపింది. శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లుగా పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంటనగరాలతో పాటు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్లలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

అటు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ 16 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముంపు ప్రాంతాల ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల హెచ్చరికల నేపధ్యంలో జిల్లా అధికారులు సైతం అప్రమత్తమయ్యారు.

ANN TOP 10