AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నా విధి రాత అదే అయితే.. అలానే తిట్టండి.. రేణూ దేశాయ్‌ ఎమోషనల్ పోస్టు

పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణూ దేశాయ్‌ మరోసారి సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌ కామెంట్స్‌ చేశారు. ఓ నెటిజన్‌ ఆమె విడాకులపై అభ్యంతరకర పోస్టు చేయగా.. రేణూ అతడికి స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు. ‘‘నన్ను నిందించడం ద్వారా మీకు ఆనందం ఉందంటే అలాగు చేయండి. మాటలు పడడం నాకు అలవాటైపోయింది. పవన్‌ కల్యాణ్‌ వ్యతిరేకుల నుంచి నిందలు పడటం నా జీవిత లక్ష్యం అనుకుంటా..’’ అని రేణూ దేశాయ్‌ పోస్ట్‌ చేశారు.

ఇటీవల రేణు దేశాయ్‌ పవన్‌కు మద్దతిస్తూ ఓ వీడియో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే! దీనిపై కొందరు వ్యక్తులు ఆమెను టార్గెట్‌ చేసి మాట్లాడారని రేణూ అన్నారు. ‘‘విడాకుల గురించి చెప్పినప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ నన్ను తీవ్రంగా ద్వేషించారు. ఇప్పుడు దేశ పౌరురాలిగా ఆయనకు మద్దతుగా మాట్లాడుతుంటే ఆయన వ్యతిరేకులు నన్ను దుర్భాషలాడుతున్నారు. మొదట విడాకుల గురించి మాట్లాడి.. ఆయన వ్యతిరేకుల నుంచి డబ్బు తీసుకున్నానని ఆరోపించారు. ఇప్పుడేమో.. పవన్‌ అనుకూల వ్యక్తుల నుంచి నేను డబ్బు తీసుకుని ఆయనకు మద్దతిచ్చానని కామెంట్స్‌ చేస్తున్నారు. నా మాజీ భర్త విషయంలో అప్పుడూ, ఇప్పుడూ రెండు సందర్భాల్లోనూ నేను నిజమే మాట్లాడాను. తప్పుగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ప్రేమలో పడినందుకు.. నిజాలుని మాట్లాడుతున్నందుకు నేను ఇలా మాటలు పడాల్సి వస్తోంది. ఇదే నా విధి రాత అయితే.. ఇలానే తిట్టండి. ఇప్పుడు ఈ పోస్ట్‌ విషయంలో కూడా నన్ను నిందించడం మొదలుపెట్టండి’’ అని అన్నారు.

ANN TOP 10