ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఖచ్చితంగా ఇవ్వాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పారని భువనగిరిలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కేబినెట్‌లో ఎక్కువ మంది ఓసీలే ఉన్నారన్నారు. కేసీఆర్ చేసింది రుణమాఫీ కాదు వడ్డీ మాఫీ మాత్రమే అని మండిపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డును కాంట్రాక్టర్లు అప్పగించి ఆ డబ్బులతో రుణమాఫీ చేశారని విరుచుకుపడ్డారు. తనకు ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని… పిల్లల బతుకు తెలంగాణ కావాలన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి వియ్యంకుడికి గంధమల్ల రిజర్వాయర్ పనులు అప్పగించారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
