మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. తమ గారాలపట్టికి క్లింకార అనే నామకరణం కూడా చేశారు. ఇక పాప పుట్టిన దగ్గరి నుంచి అభిమానులు క్లింకార ఫొటో కోసం ఎదురుచూస్తున్నారు. మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉపాసన క్లీంకార ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఉపాసన తల్లిదండ్రులు క్లింకారను ఎత్తుకుని జెండా వందనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
