AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బెస్ట్ ఎస్‌ఐగా 9వ సారి అవార్డ్ ..సూపర్‌ పోలీస్‌ ఎక్కడున్నారో తెలుసా..?

పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగుల పనితీరుకు నిదర్శనం వాళ్ల సిన్సియారిటీ. ఆ ఎస్‌ఐ ఉత్తమ పోలీస్ అధికారిగా వరుసగా 9సార్లు ప్రభుత్వం నుంచి ప్రశంసా పత్రం అందుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్‌రెడ్డి 2023 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 9వ సారి ప్రభుత్వం నుంచి ఉత్తమ ఎస్‌ఐ అవార్డు(Best S.I)తో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. శ్రీకాంత్‌రెడ్డి ప్రస్తుతం రేగొండ(Raygonda) ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఈ గౌరవం దక్కడం పట్ల రేగొండ మండల ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు.

సూపర్ పోలీస్..
పోలీస్‌శాఖలో ఉద్యోగం అంటే కత్తి మీద సాములాంటిది. అందులో ఎస్‌ఐ స్థాయి అధికారి అంటే పైస్థాయి అధికారుల నుంచి ఒత్తిడి..కింది స్థాయి సిబ్బందితో పని చేయించుకునే సామర్ధ్యం తెలిసి ఉండాలి. మరీ ముఖ్యంగా వరంగల్ జిల్లా లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తే మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఉత్తమ సేవలందించిన అధికారులకు విశిష్ట సేవా పురస్కారంతో పాటు ఉత్తమ ఎస్‌ఐలుగా అవార్డులు అందజేసింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని రేగొండలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్‌రెడ్డిని ప్రభుత్వం ఉత్తమ ఎస్‌ఐగా గుర్తించింది అవార్డు అందజేసింది.

ANN TOP 10