AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ అభ్యర్ధులకు అలర్ట్.. టెట్‌ దరఖాస్తుకు నేడే ఆఖరి రోజు!

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) 2023 రాసేందుకు దరఖాస్తు గడువు బుధవారం (ఆగస్టు 16)తో ముగియనుంది. ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపులకు కూడా ఈ రేజే ఆఖరు. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని వారు ఈ రోజు రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాగా ఆగస్టు 1న టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలవ్వగా ఆగస్టు 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైంది.

మంగళవారం (ఆగస్టు 15) నాటికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.40 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి దరఖాస్తుదారుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. మరో వైపు హైదరాబాద్‌, వికారాబాద్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, కొత్తగూడెం.. ఈ ఆరు జిల్లాల్లో పరీక్షా కేంద్రాల సామర్థ్యం నిండిపోవడంతో వీటిని ఈ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను బ్లాక్‌ చేశారు. ఇక కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఆ జిల్లాల్లో పరీక్ష రాసేందుకు వీలుండదు. దీంతో పరిపడా పరీక్షా కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయలేదని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ANN TOP 10