నేడు భారత్ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొని జెండాను ఎగురవేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. కాగా, 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై భారత జెండాను ప్రదర్శించారు. అర్ధరాత్రి 12 గంటల ఒక్క నిమిషానికి బుర్జ్ ఖలీఫాపై ఎల్‌ఈడీ లైట్లతో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఆ సమయంలో భారత జాతీయ గీతం కూడా వినిపించింది. ఈ అద్భుత దృశ్యాలను చూసిన అక్కడి భారత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.