AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

క్రేజీ ఛాన్స్ కొట్టేసిన రష్మిక..

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రంతో కన్నడ బ్యూటీ రష్మిక క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు తెలుగుతోపాటు.. హిందీ, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న రష్మిక.. ఇప్పుడు మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కొత్త ప్రాజెక్టులో కథానాయికగా ఎంపికైంది నేషనల్ క్రష్. ధనుష్ 51వ సినిమా పేరు ‘డి 51’ . ఈ సినిమాలో కథానాయికగా రష్మిక ఎంపికైనట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు మేకర్స్. దీంతో నేషనల క్రష్ కు కంగ్రాట్స్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. ‘డి51’ సినిమాలో ధనుష్ డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నాడు.

ANN TOP 10