AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో తొలి డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్..

హైదరాబాద్ క్రీడా అభిమానులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ 8న వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) ఈవెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. గచ్చిబౌలిలోని GMC బాలయోగి ఇండోర్ స్టేడియం “WWE సూపర్‌స్టార్ స్పెక్టాకిల్” ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ట్విట్టర్‌లో ప్రకటించారు. ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి విడుదల చేశారు.

ఈ ఈవెంట్‌లో ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేథ్ ‘ఫ్రీకిన్’ రోలిన్స్, మహిళల ప్రపంచ ఛాంపియన్ రియా రిప్లే, వివాదరహిత WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్ సమీ జైన్, కెవిన్ ఓవెన్స్‌లతో సహా కీలక WWE సూపర్‌స్టార్స్ హాజరవుతారని ఆయన తెలిపారు. అలాగే WWE సూపర్‌స్టార్లు జిందర్ మహల్, వీర్, సంగ కూడా ఇందులో పోటీపడనున్నారు. ఈ ఈవెంట్ టిక్కెట్లు www.bookmyshow.comలో అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

ANN TOP 10