ప్రజా సేవాభవన్‌కు తరలివస్తున్న జనం
కంది శ్రీనన్న సమక్షంలో జోరుగా చేరికలు
ఆదిలాబాద్: కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి క్యాంపుకార్యాలయమైన ప్రజా సేవాభవన్ నిత్యం కాంగ్రెస్ శ్రేణులు ,అభిమానులు ప్రజలతో సందడిగా ఉంటోంది. ప్రతీరోజు వివిధ గ్రామాలు ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీలనుంచి ప్రజలు తరలివచ్చి కంది శ్రీనివాసరెడ్డిని కలుస్తున్నారు. శాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కొందరు తమ బాధలు సమస్యలను ఆయన తో చెప్పుకుంటున్నారు. అందరినీ ఆదరించి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి అత్యంత పేదరికంలో బాధ పడుతున్నవారికి ఆర్థిక సాయం చేస్తూ అండగా నిలబడుతున్నారు కంది శ్రీనివాస రెడ్డి. జైనథ్ మండలం గిమ్మ గ్రామానికి చెందిన పెంటపర్తి ఆశన్నఅనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని అతని వైద్యఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయమందించారు.

పట్టణంలోని రణదివేనగర్ కాలనీ వాసులు ,ఎంప్లాయిస్ కాలనీవాసులు కంది శ్రీనివాస రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంప్లాయీస్ కాలనీలో నూతనంగా ఎన్నుకోబడ్డ వార్డు ప్రెసిడెంట్ ఏనుగు విలాస్ రెడ్డికి కంది శ్రీనివాస రెడ్డి అభినందనలు తెలిపారు. అలాగే ఆదిలాబాద్ అసెంబ్లీ సోషల్ మీడియా కో.ఆర్డినేటర్ గా నియమితులైన పుండ్రు రవి కిరణ్ రెడ్డిని అభినందనలు తెలిపి శాలువా,పుష్ప గుచ్చంతో సత్కరించారు. బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆడే గజేందర్ కంది శ్రీనివాస రెడ్డి ని కలిశారు. సాదర స్వాగతం పలికిన కెఎస్ ఆర్ ఆయనను శాలువా,పుష్ప గుచ్ఛంతో సత్కరించారు.
అనంతరం తాటిగూడ కాలనీ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు షేక్ సలీం ను అతని నివాసంలో కలిసి పలకరించారు. ఐఎన్‌టీయూసీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మునిగేల నర్సింగ్ అనారోగ్యం తో ఉండడంతో అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట గిమ్మ సంతోష్, షకీల్, మహేందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, పుండ్రు రవి కిరణ్ రెడ్డి, కిష్టా రెడ్డి, కొండూరి రవి, రామ్ రెడ్డి, అస్బాత్ ఖాన్, చాన్ పాషా, మానే శంకర్, ప్రవీణ్, వసీమ్ రంజాని,అభిబ్ ఓసావార్ సురేష్, ధన్ రాజ్, మహబూబ్, మన్సూర్, కర్మ, అస్బాత్ ఖాన్, షేక్ ముజహిద్, షేక్ షాహిద్ తదితరులు ఉన్నారు.










