అతిలోక సుందరి అనే పదం వింటే నటి శ్రీదేవి తప్ప ఇంకెవరూ గుర్తుకు రారు. అందానికి, నటనకు కేరాఫ్ అడ్రస్ ఆమె. జాతీయ స్ధాయిలో అగ్రశ్రేణి నాయికగా పేరు సంపాదించుకున్న శ్రీదేవి ఇంకా ఎంతో భవిష్యత్ ఉండగానే ప్రమాదవశాత్తు మరణించారు. ఆమె లేరు అన్న నిజాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేరు. ఈరోజు శ్రీదేవి పుట్టినరోజు. ఈ సందర్భంలో గూగుల్ ప్రత్యేక డూగుల్‌తో గౌరవించింది.









