AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో దారుణం.. అర్ధరాత్రి వేళ బాలికల గదిలోకి అధికారి

హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. స్కూల్‌లోని బాలికలపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. బాలికలను నిత్యం వేధింపులకు గురి చేస్తున్న సదరు కీచక అధికారి.. అర్ధరాత్రి దాటిన తర్వాత వారి గదుల్లోకి అక్రమంగా చొరబడుతున్నాడు. ఆట విడుపు పేరుతో వికృతి చేష్టలకు దిగుతున్నాడు. బాలికలను కారులో ఎక్కించుకొని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో స్కూల్‌లోని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారిపై ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదని.. ఉన్నతాధికారుల అండదండలతో తమపై వేధింపులకు పాల్పడుతున్నారని వాపోయారు.

ఈ ఘటనపై మీడియాలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. వాటిపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఈ ఘటనన తనను ఎంతో కలిచివేసిందని ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదని అన్నారు. బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలని, పూర్తి స్థాయి విచారణ జరిపించి, బాధితురాళ్లకు న్యాయం చేయాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కోరారు.

ANN TOP 10