వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే బీఆర్ఎస్ పథకాలు పెడుతోందని కాంగ్రెస్ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం నాడు మణుగూరులో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు ఎన్నికల ముందు గృహ లక్ష్మీ పథకం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.. ఆరు నెలల ఆలోచన తర్వాత ప్రజల దీవెనలతో రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీ లో చేరానని అన్నారు. కేసీఆర్ 9ఏళ్లలో తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడో సారి అధికారం కోసం మాయ మాటలు చెప్పి పథకాలు ప్రవేశ పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలు కావాలంటే తప్పకుండా కాంగ్రెస్‌కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సర్వేల ప్రకారమే బీఫామ్ ఇస్తుందన్నారు. ఆశవాదులు ఎంతమంది ఉన్న కలిసి కట్టుగా కాంగ్రెస్‌ని గెలిపిస్తామని చెప్పారు. మంచి మెజార్టీతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని10 సీట్లు గెలిపించి సోనియాగాంధీ కి బహుమతిగా ఇద్దామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.









