AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బాలికపై ఆవు దాడి .. కొమ్ములతో పైకి లేపి, కాళ్లతో తొక్కుతూ..

చైన్నైలో బుధవారం నాడు దారుణమైన ఘటన చోటు చేసుకుంది.. స్కూలుకు వెళుతున్న ఓ తొమ్మిదేళ్ల బాలికపై ఆవు దాడి చేసింది. కొమ్ములతో పైకి లేపి విసిరికొట్టింది.. కాళ్లతో తొక్కుతూ బీభత్సం సృష్టించింది. బాలికను రక్షించేందుకు ప్రయత్నించిన పెద్దవారిపైనా దాడికి ప్రయత్నించింది. సిటీలోని ఎంఎండీఏ కాలనీలో జరిగిన ఈ దారుణంలో తీవ్రంగా గాయపడిన బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆవు దాడి చేసిన ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

తాజాగా ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చెన్నైకి చెందిన జాఫర్ సిద్దిఖ్ అలీ తొమ్మిదేళ్ల కూతురు అయేషా రోజూలాగే బుధవారం ఉదయం స్కూలుకు బయలుదేరింది. ఇంటి నుంచి కాలినడకన వెళుతుండగా.. ఎంఎండీఏ కాలనీలో ఆర్ బ్లాక్ వద్ద ఆయేషాపై ఆవు దాడి చేసింది. వెనక నుంచి కొమ్ములతో ఆయేషాను ఎత్తి కింద పడేసింది. ఆపై కొమ్ములతో నేలపై ఈడుస్తూ, కాళ్ళతో తొక్కుతూ దాడి చేసింది. ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్లు అదిలించేందుకు ప్రయత్నించగా.. ఆవు వారిపైకి వెళ్లింది. దీంతో వారు వెనక్కి తగ్గారు. చివరకు కర్రలతో బెదిరించి ఆవును తరిమేశారు. ఈ దాడిలో ఆయేషాకు తీవ్ర గాయాలయ్యాయి.

ANN TOP 10