తెలంగాణలో ఎన్‌ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏకకాలంలో జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన బలగాలు తనిఖీలు చేస్తున్నాయి. తబ్రేజ్ అనే వ్యక్తి పీఎఫ్‌ఐ అనే నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్నాయనే సమాచారంతో సోదాలు జరుపుతోంది. ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న తబ్రేజ్ ఉగ్రదాడులకు ఏమైనా ప్లాన్ చేశారా అనే సందేహాలతో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయి ఎన్‌ఐఏ బృందాలు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం, ఆధారాలు దొరక్కపోవడంతో తబ్రేజ్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.
ఉగ్ర కదలికలపై నిఘా..
నిషేధిత ఉగ్రవాద కార్యకలాపాలు జరిగే అవకాశముందన్న సమాచారంతో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ బృందాలు కరీంనగర్ , ఆదిలాబాద్‌లో సోదాలు నిర్వహిస్తున్నాయి. కరీంనగర్‌లోని హుస్సేనీకూరలోని స్థానిక పోలీసులతో కలిసి ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. పాపులర్ పార్టీ ఆఫ్ ఇండియా అనే నిషేధిత ఉగ్రవాద సంస్థతో తబ్రేజ్ అనే వ్యక్తికి సంబంధాలున్నాయనే సమాచారంతో దాడులు నిర్వహించారు.









