కరీంనగర్ హుస్సేనీ పూరలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ కీలక నేత ఇంట్లో సోదాలు జరుపుతోంది. ఈ సోదాల్లో ఎన్ఐఏతోపాటు, స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాలుగున్నర గంటలుగా పీఎఫ్ఐ నేత ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. పలు కీలక డ్యాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయంలో సదరు నేత ఇంట్లో లేరని తెలుస్తోంది. గల్ఫ్‌లో ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. నిషేధిత సంస్థ లింకులను అధికారులు గుర్తించారు.









