వేములవాడ నియోజకవర్గంలో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. వేములవాడ ముఖద్వారం వద్ద సుందరీకరించిన నంది కమాన్ జంక్షన్‌ను, పట్టణంలోని చింతల్ ఠాణా వద్ద పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్‌ను, నవజాత శిశువులు, శిశువులలో ఎదుగుదల లోపాలు లేకుండా చూసుకునేందుకు ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించారు.









