AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గోల్డ్ ప్రియులకు తీపికబురు.. భారీగా పడిపోయిన బంగారం ధరలు

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరే శుభవార్త. బంగారం, వెండి ధరలు మళ్లీ పతనం దిశగా కనిపిస్తున్నాయి. క్రితం సెషన్‌లో గోల్డ్ రేట్లు స్థిరంగా ఉండగా.. ఇవాళ సైతం ఎలాంటి మార్పు లేదు. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేట్లు భారీగా పడిపోయాయి. దేశీయ మార్కెట్లోనూ వెండి ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ముందు ముందు మరింత దిగివచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయ గిరాకీ తగ్గడం వంటి కారణాలు చెబుతున్నారు. ఈ క్రమంలో గోల్డో, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో స్థిరంగా బంగారం ధర..
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు దిగివస్తున్నప్పటికీ క్రితం సెషన్‌తో పాటు ఇవాళ కూడా హైదరాబాద్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 55 వేల 150 వద్ద ఉండగా 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రూ. 60 వేల 160 వద్ద ఉంది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ రేటు స్థిరంగానే ఉంది. ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 55 వేల 300 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు తులానికి రూ. 60 వేల 130 పలుకుతోంది.

మళ్లీ పడిపోయిన వెండి ధర..
బంగారం ధరలో ఎలాంటి మార్పు లేకపోయిన వెండి ధర మాత్రం ఇవాళ కాస్త దిగివచ్చింది. ప్రస్తుతం మన హైదరాబాద్ మార్కెట్లో చూస్తే కిలో వెండి రేటు రూ. 200 పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 78 వేల 300 మార్క్ వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో చూస్తే కిలో వెండి ధర రూ. 100 తగ్గింది. ప్రస్తుత కిలో రేటు రూ. 75 వేల మార్క్ వద్దకు దిగివచ్చింది.

ANN TOP 10