AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎస్టీలకు కేటాయించిన నిధులు ఎస్టీలకే.. కవిత

గిరిజన సంక్షేమంపై శాసనమండలిలో జరిగిన లఘు చర్చలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… మణిపూర్‌లో రెండు గిరిజన తెగల మధ్య కొట్లాట పెట్టించి చలి కాచుకుంటున్నారని మండిపడ్డారు. మణిపూర్ అల్లర్లను కట్టడి చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. విభజించి పాలించి ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. బ్రిటీషర్లు మెదలు పెట్టింది‌‌ .. బీజేపీ ఫాలో అవుతుందని విమర్శించారు. ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ కేంద్రానికి పంపించామని తెలిపారు. 4 లక్షల 5వేల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేశామన్నారు.

లక్షా యాభై వేల మంది గిరిజనులకు పోడు పట్టాలు ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి.. కేసీఆర్ సర్కార్ నినాదమని చెప్పుకొచ్చారు. గిరిజనులకు రూ.1336 కోట్లు కళ్యాణ లక్ష్మీ కోసం నిధులు ఖర్చు చేశామని తెలిపారు. ఎస్టీలకు కేటాయించిన నిధులు ఎస్టీలకే ఖర్చు చేయటానికి కేసీఆర్ 2017లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చారన్నారు. ఆదివాసీ భవన్‌తో పాటు.. కొమురం భీం పేరుతో జోడే ఘాట్‌ను అభివృద్ధి చేసుకున్నామన్నారు. రూ.22 కోట్లతో హైదరాబాద్‌లో సేవాలాల్ బంజారా భవన్ నిర్మించామన్నారు. తెలంగాణకు ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులు కేంద్రం ఇవ్వటం లేదని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేశారు.

ANN TOP 10