గ్రామ గ్రామాన మార్మోగుతున్న కంది శ్రీనివాస రెడ్డి పేరు
అమెరికా నుండి ఆదిలాబాద్ కు తమ కోసమే ఆ దేవుడు పంపినట్టుగా చెబుతున్న జనం
గడప గడపకు గుండె గుండెకు చేరిన కంది శ్రీనివాస రెడ్డి సేవా గుణం
నిస్వార్ధ సామాజిక సేవలతో ప్రజల విశ్వాసం పొందిన శ్రీనన్న
కంది శ్రీనివాస రెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలని తపిస్తున్న ప్రజలు
కంది శ్రీనివాస రెడ్డి ..ఈ పేరు ఆదిలాబాద్ నియోజక వర్గంలోనే కాదు జిల్లాలో కూడా హాట్ టాపిక్. జిల్లా రాజకీయాల్లో ఒక సంచలనం. తను పుట్టిన జిల్లా ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి అమెరికా లో విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని తమకోసం వచ్చిన కంది శ్రీనివాస రెడ్డే తమ నాయకుడని జనమంటున్నారు.ఆ దేవుడే తమకోసం పంపినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే నిస్వార్ధ సామాజిక సేవలతో నియోజకవర్గంలోని గడప గడపకు గుండె గుండెకు ఆయన సేవా గుణం చేరి ప్రజల విశ్వాసం పొందారు.

కంది శ్రీనివాస రెడ్డి ఆయన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు,నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యేజోగు రామన్నను ప్రశ్నిస్తున్నతీరు ..ఆదిలాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం కంది శ్రీనివాస రెడ్డి పడుతున్న తపన చూసి జనం ఫిదా అవుతున్నారు. కంది శ్రీనివాస రెడ్డి డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదని సొమ్మే ప్రధానమనుకుంటే ఇక్కడికి వచ్చేవారే కాదని విమర్శకుల నోళ్లు మూయిస్తూ కంది శ్రీనివాస రెడ్డి కి మద్దతు పలుకుతున్నారు. అందుకే ఈసారి ఎన్నికలు ముందులా ఉండవని, అధికార పార్టీకి ఎదురు నిలిచి గెలిచి తీరే నాయకుడు కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస రెడ్డి మాత్రమేనన్న వాదన అంతటా వినిపిస్తోంది.











