AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మణిపూర్ తాజా ఘర్షణల్లో 17 మందికి గాయాలు

మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాకు చెందిన కంగ్వాయ్, ఫౌగక్‌చో ప్రాంతాలలో గురువారం జరిగిన ఘర్షణలలో 17 మంది గాయపడ్డారు. ఘర్షణపడుతున్న మూకలను చెదరగొట్టేందుకు సైన్యం, ఆర్‌ఎఎఫ్ సిబ్బంది బాష్పవాయు గోళాలను ప్రయోగించాయి.

ఇంఫాల్ లోయవ్యాప్తంగా రాత్రి వేళల్లో కర్ఫూ కొనసాగుతోంది. పగటి వేళల్లో కర్ఫూ సడలిస్తున్నట్లు ఇంఫాల్, తూర్పు, పశ్చిమ జిల్లాల మెజిస్ట్రేట్లు ఇదివరకు ప్రకటించినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా పగటి పూట ఆంక్షలను కొనసాగిస్తున్నారు.

ఘర్షణలు జరగడానికి ముందు చురచంద్‌పూర్ జ్లిలాలో జాతుల మధ్యహింసాకాండలో మరణించిన కుకీజోమీ తెగలకు చెందిన వారి మృతదేహాల సామూహిక ఖననంపై మణిపూర్ హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో సామూహిక ఖననం నిలిచిపోయింది. మోలై ఖోపి గ్రామంలో 35 మంది కుకీ ప్రజల సామూహిక ఖననాన్ని వాయిదావేసినట్లు గిరిజనులకు చెందిన సంఘం ఐటిఎల్‌ఎఫ్ ప్రకటించింది.

ANN TOP 10