AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇప్పటికైనా రైతు రుణమాఫీ గుర్తుకు రావడం సంతోషం

ఎన్నికలు సమీపిస్తున్న వేల అయినా సీఎం కేసీఆర్‌కు (CM KCR) రైతు రుణమాఫీ గుర్తు రావడం సంతోషమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియాతో పాయింట్ వద్ద ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. 36 వేలలోపు బకాయిలు ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. విడతల వారిగా రైతు రుణమాఫీ చేస్తామని గత ఎన్నికల్లో ప్రకటించారని.. ఆ విధంగా ఇప్పటికే రైతు రుణమాఫీ పూర్తి కావాలన్నారు. రుణమాఫీ లేట్ కావడం వల్ల వడ్డీ పెరిగిందని… రుణమాఫీ మొత్తం వడ్డీకే సరిపోతుందని తెలిపారు. అన్ని సబ్సీడీలు ఎత్తేసి రైతు బంధు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. ఆగష్టు వచ్చినా 6 ఎకరాల పైబడిన వారికి రైతు బంధు రాలేదన్నారు. వాయిదా పద్ధతిలో కాకుండా ఏక కాలంలో రైతు రుణమాఫీ చేయాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు.

ANN TOP 10