తెలంగాణలో పోలీసు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి జీవో నెంబర్ 57, 58లపై పలువురు ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు ఆ పిటిషన్ పై విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. అప్పటి వరకు ఫలితాలు వెల్లడించవద్దని ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది హైకోర్టు.









