AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీకి సినీనటి జయసుధ.. నేడే బీజేపీలో చేరిక

సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు జయసుధ కాషాయం తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలో జయసుధ దేశరాజధానికి చేరుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో ఈరోజు సాయంత్రం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మధ్యాహ్నం జయసుధ కాషాయి కండువా కప్పుకోనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, బండి సంజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ విజయం సాధించారు. అయితే గతంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన జయసుధ.. ఇప్పుడు ముషీరాబాద్ లేదా సికింద్రాబాద్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

ANN TOP 10